ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పామూరు మండలంలోని డీవీపల్లి గ్రామంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ యారవ రమా శ్రీనివాస్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రేషన్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.