ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని ఇమ్మడ చెరువు గ్రామం ఎస్సీ కాలనీలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు. మాజీ సర్పంచ్ బాలయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో మంచినీళ్ల వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారమైందన్నారు.