VZM: శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రేపు జరగనున్న వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సన్యాసినాయుడు పిలుపునిచ్చారు. గుర్లలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గరివిడి క్యాంప్ ఆఫీసులో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుందని, మండల వైసీపీ శ్రేణులు హాజరుకావాలని కోరారు.