GNTR: కల్తీ మద్య విక్రయాలను అరికట్టాలని వైసీపీ నాయకులు సోమవారం తాడికొండలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్ డైమండ్ బాబు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.