HYD: నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్-3లో లీకేజీ ఏర్పడింది. కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు ఉన్న 2,375 MM డయా పైపులైన్పై లీకేజీని గుర్తించారు. దీనిని సరిచేయడానికి, ఎయిర్ వాల్వ్, గేట్ వాల్ల మార్పు వంటి మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంచినీటి సరఫరాకు 36 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని ప్రకటించారు.