MNCL: బీసీలను బీజేపీ మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. ఆదివారం దండేపల్లిలో నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థలకు రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం సామాన్యులకు గుంట భూమి కూడా ఇవ్వలేదన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలు చేయక తప్పదన్నారు.కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఉన్నారు.