KDP: మెగా డీఎస్సీ నిర్వహణతో కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయులుగా ఎంపికైన 70 మందిని శనివారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతిష్ఠాత్మకంగా డీఎస్సీ నిర్వహించామన్నారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.