SDPT: పట్టణంలోని ఇందూర్ సబ్స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కంచరి బజార్, బురుజు ఏరియా, సుభాష్ రోడ్డు, ఓల్డ్ బస్టాండ్, మోహినిపుర, ఓల్డ్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.