ADB: జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ MP నగేశ్, MLA పాయల్ శంకర్ పాల్గొని, కాలనీవాసులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.