HYD: ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాహెబ్ కుంట నివాసి మొహమ్మద్ షదాబ్(35) అనే క్యాబ్ డ్రైవర్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, షదాబ్ చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఫలక్నుమా పోలీసులు కేసు నమోదు చేసారు.