»The Overturned Police Vehicle Si And The Driver Died On The Spot At Mangapet Mulugu
Accident: పల్టీ కొట్టిన పోలీస్ వాహనం..ఎస్సై, డ్రైవర్ స్పాట్ డెడ్
విధుల్లో భాగంగా పోలీసు వాహనంలో వెళ్తున్న అధికారులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్(accident) సంభవించింది. ఈ క్రమంలో ఎస్సై, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా(mulugu district)లో చోటుచేసుకుంది.
ములుగు జిల్లా(mulugu district) ఏటూర్ నాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. విధుల్లో భాగంగా పోలీసు వాహనంలో వెళుతున్న క్రమంలో ఆకస్మాత్తుగా యాక్సిడెంట్ చోటుచేసుకుంది. దీంతో వాహనంలో ఉన్న ఎస్సై ఇంద్రయ్యతోపాటు డ్రైవర్ రాజు కూడా మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్ జీడివాగు పరిధిలో చోటుచేసుకుంది.
అయితే విధుల్లో భాగంగా ఎస్సై ఇంద్రయ్య, కానిస్టేబుల్ శ్రీనివాస్, డ్రైవర్ రమేష్ తో కలిసి పోలీస్ వాహనంలో మంగపేట(mangapet) వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భాగంగా వాహనం పల్టీ కొట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కానిస్టేబుల్ శ్రీనివాస్ కు స్పల్ప గాయాలయ్యాయి.
ఇది కూడా చూడండి:Tillu Tajpuriya : తీహార్ జైలులో గ్యాంగ్ వార్.. గ్యాంగ్ స్టర్ హత్య
విషయం తెలుసుకున్న ఏటూర్ నాగారం(eturnagaram) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృత దేహాలను పోస్టుమార్టు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై కూడా పోలీసులు(police) వివరాలు ఆరా తీస్తున్నారు. అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందా? లేదా డ్రైవర్ నిద్ర మత్తులో లేదా మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా అనే కోణాల్లో కూడా అధికారులు వివరాలను ఆరా తీస్తున్నారు.