CTR: ప్రజల వినతులను సకాలంలో పరిష్కరించాలని మున్సిపల్ ఇంజినీర్ వెంకటరామరామిరెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వారి కార్యాలయం ప్రజాదర్బార్లో శుక్రవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాగా, చిత్తూరు అర్బన్, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాలకు సంబంధించిన ప్రజలు కార్యక్రమానికి వచ్చారు.