»Thieves Entered The House To Steal The Scooty Lost Their Own Scooty Will Not Stop Laughing After Watching The Video
Funny Viral: దొంగతనానికి వస్తే పరిగెత్తిచ్చి కొట్టారు
సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తుంటారు. పట్టపగలు చేసేటప్పుడు ఎవరూ లేనిది చూసి ఎటాక్ చేస్తారు. దొంగతనం చేసే సందర్భంలో కొందరు దొరికిపోయి ఇబ్బందుల్లో పడతారు.
Funny Viral: సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్(Target) చేసుకుని దొంగతనాలు చేస్తుంటారు. పట్టపగలు చేసేటప్పుడు ఎవరూ లేనిది చూసి ఎటాక్(Attack) చేస్తారు. దొంగతనం(Theft) చేసే సందర్భంలో కొందరు దొరికిపోయి ఇబ్బందుల్లో పడతారు. అలాగే పట్టపగలు స్కూటీ దొంగతనం చేసేందుకు వచ్చి దొరికిపోయిన దొంగల వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. వీడియో లో దొంగలను ప్రజలు ఎలా పరిగెత్తించారో చూడవచ్చు. వ్యక్తులు దొంగిలించి పట్టుబడేందుకు ప్రయత్నించే వీడియో సీసీటీవీలో రికార్డైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో స్కూటర్(Scooter) దొంగిలించడానికి ఇద్దరు దొంగలు సొసైటీలోకి ప్రవేశిస్తారు. స్కూటీని గేటు నుంచి బయటకు తీస్తుండగా ఓ వ్యక్తి వారిని చూస్తాడు. వెంటనే స్కూటీని లాక్కొని దొంగలు కొడతారు. తిరిగి అతడిపై దొంగలు దాడి చేస్తారు. ఈ లోగా కొంతమంది దొంగ(Theif)లను పట్టుకునేందుకు, ఆ వ్యక్తి సాయంగా వస్తారు. వారి చూసి దొంగలు పరిగెత్తుతారు. అయినా దొంగలను వెంబడిస్తారు. ఆ సమయంలో వారొచ్చిన సొంత స్కూటీని అక్కడే వదిలేశారు. వైరల్ అవుతున్న వీడియో చూసి చాలా మంది నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ వీడియో చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయబడింది.
@cctvidiots అనే ఖాతా నుండి ఈ వీడియో ట్విట్టర్(Twitter)లో వైరల్‌గా మారింది. ఇద్దరు దొంగలు ఓ ఇంటి నుంచి స్కూటర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించారని, అయితే తమ సొంత స్కూటర్ని వదిలి పారిపోవాల్సి వచ్చిందని క్యాప్షన్‌లో ఉంది. ఇదంతా చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ప్రజలు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూశారు. దీనిపై కొందరు సరదా వ్యాఖ్యలు చేశారు.