టీవీకే పార్టీ అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలో ఉన్న ఆయన ఇంట్లో ఇవాళ ఉదయాన్నే బాంబులు పేలుతాయని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో బెదిరించాడు. పోలీసులు, బాంబు స్క్వాడ్ అప్రమత్తమై విజయ్ నివాసంలో సోదాలు చేపట్టగా, ఎలాంటి బాంబు బయటపడకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించి గుర్తుతెలియని వ్యక్తి గురించి వెతుకుతున్నారు.