KRNL: ఆస్పరి మండలం జొహరాపురం, ఆలూరు మండలంలోని మొలగవెల్లి, పెద్దహోతూరు గ్రామాల్లోని పంట పొలాల్లో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. బుధవారం ఈ విషయం తెలియడంతో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుత పాదముద్రలను పరిశీలించారు. ప్రజలు, రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.