TG: చలో బస్‌భవన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పెంచిన బస్సు చార్జీలపై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో మాజీమంత్రి హరీశ్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు ఇంటి దగ్గర, మరోవైపు కేటీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా గృహనిర్భంధం చేశారు.