SRCL: మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోయారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో డీఆర్డీవో శేషాద్రికి బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షుడు నేదూరి మధు మాట్లాడుతూ.. సక్రమంగా జీతాలు రాక పండుగలు కూడా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ జీవితాలను విడుదల చేయాలన్నారు.