ATP: గుత్తిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇవాళ జీఎస్టీ పై అవగాహన పెంచడానికి విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలను పూర్తిగా తగ్గించిందని, అందరూ అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మీనాక్షి, సిబ్బంది పాల్గొన్నారు.