KMR: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్లపై కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో కామారెడ్డి జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 25 జడ్పీటీసీ, 25 ఎంపీపీ పదవుల భవితవ్యాన్ని, అలాగే 233 ఎంపీటీసీ స్థానాలు, 532 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది.