ఏప్రిల్(April) నెల రేపటితో ముగుస్తుంది. ప్రతి నెల లాగే మే(May) నెలలో కూడా పలు నిబంధనలు(Rules) మారనున్నాయి. వినియోగదారులు ఆ రూల్స్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంది. మరి మే నెలలో కొత్తగా వస్తున్న ఆ మార్పులు, నిబంధనలు(New Rules) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటి వరకూ జీఎస్టీ(GST)లో అనేక రూల్స్(Rules) వచ్చాయి. వ్యాపారులు కొత్త నిబంధనలకు అనుగుణంగా బిజినెస్(Business) చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలుపుతూనే ఉంటారు. మే నెల నుంచి కొత్త రూల్ (New Rule)ను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును 7 రోజుల్లోపు ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో అప్లోడ్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధన తెచ్చారు. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉండే కంపెనీలకు మాత్రం వస్తువులు, సేవా పన్ను(Tax)ల్లో మార్పు ఉంటుందని, ఈ రూల్ కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం వెల్లడించింది.
మ్యూచువల్ ఫండ్ల(Mutual Funds)లో ఇన్వెస్ట్ చేసేవారు ఇ-వాలెట్ల(E Wallet)ను వినియోగిస్తుంటారు. ఇకపై అవి ఆర్బీఐ(RBI) విధించిన కేవైసీ(KYC) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సెబీ ఆదేశించింది. మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. దీంతో ఇకపై మీ వాలెట్ కేవైసీ కాకపోతే కనుక దాని ద్వారా పెట్టబడి పెట్టలేరు. ఇవే కాకుండా మే తొలి వారంలో గ్యాస్ ధరలు(Gas), సీఎన్జీ(CNG) ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.