AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి TTD ఛైర్మన్ BR నాయుడు తీరని ద్రోహం చేస్తున్నారని, ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అగ్రహం వ్యక్తంచేశారు. TTD అదనపు JEO వెంకయ్య చౌదరి తండ్రి పెద్దకర్మకు వెళ్లి వేదాశీర్వచనం చేయడమేంటని ప్రశ్నించారు. ఆయన వధువు, విధవకు తేడా తెలియని వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు.