AKP: కలెక్టరేట్లో ఈనెల 6వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్, డివిజన్, మండల కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి నేరుగా రాలేనివారు meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను పంపించవచ్చునని పేర్కొన్నారు.