VKB: దోమ మండలలోని పాలేపల్లి, ఐనాపూర్ బీటీ రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర తేలి పెద్ద, పెద్ద గుంతలుగా తయారయ్యాయి. ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.