BDK: అశ్వాపురం ఏజెన్సీ ప్రాంతాల పేదలకు వైద్య సేవలు అందించి వారికి బాసటగా నిలవడమే లయన్స్ క్లబ్ స్టార్స్ ముఖ్య ఉద్దేశమని అశ్వాపురం లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ నలగట్ల సత్య ప్రకాష్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని కాలువ బజార్ ఎస్సీ కాలనీలలో సుమారు 50 మందికి పైగా డయాబెటిక్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.