VZM: బొబ్బిలి మండలం కలవరాయి కోమటిపల్లికి చెందిన తూర్పు భాగవతం కళాకారుడు బొంతల కోటి శంకరరావును ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం అభినందించారు. తూర్పు భాగవతం కళ ప్రాచుర్యానికి ఆయన చేసిన కృషికి జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. ఈ మేరకు శంకరరావును ఎమ్మెల్యే బొబ్బిలి కోటలో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తు తరాల వారికి ఈ కళను అందించాలని సూచించారు.