విజయనగరం: బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 3 రోజులుగా తాగునీరు రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరగడంతో విద్యుత్ సరఫరాను ఆపివేశారు. దీంతో బొబ్బిలి కోట నుంచి తాగునీటిని తెచ్చి వాడుకుంటున్నారు. చేతిపంపు, బోర్లు బాగుచేయాలని పంచాయతీ అధికారులకు తెలిపినా నిర్లక్ష్యం చేయడంవల్లే నీటికొరత వచ్చిందని వాపోయారు.