ADB: ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడకు చెందిన వివాహిత అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బి. సునిల్ కుమార్ తెలిపారు. శనివారం తన కుమారుడిని వెంటపెట్టుకొని శివాజీ కూడలిలోని బ్యాంకుకు వెళ్లిన ఆమె అక్కడ కుమారుడి చెప్పు తెగిపోయిందని చెప్పి కుట్టించుకోవటానికి పంపింది. అతడు తిరిగి వచ్చేప్పటికి ఆమె కనబడలేదు.