AP: లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. SEP 29న విజయవాడ ACB కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయగా.. ఇందులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదని CID పిటిషన్ వేసింది. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన 10 రోజులకే రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.