AP: ఆటోడ్రైవర్ల పిల్లల చదువులకు రుణాలు ఇప్పిస్తామన్నారు.. ఇచ్చారా అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. అలాగే, ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా ? సీఎం చంద్రబాబు ఆటోడ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు.. ఏమైందని గుర్తుచేశారు. ఆటోడ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా చేస్తామన్నారు.. చేశారా? అని చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పించారు.