బాపట్ల పట్టణంలోని 31వ వార్డు నరాలశెట్టివారిపాలెం స్మశాన రహదారి పూర్తిగా చెట్లతో నిండిపోయిందని స్థానికులు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఇవాళ హుటాహుటిన జేసీబీ ద్వారా రోడ్డుకు ఇరువైపున పెరిగిపోయిన చెట్లను తొలగించి రహదారికి మోక్షం కల్పించారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.