KMM: చింతకాని మండలం రామకృష్ణాపురంలో శుక్రవారం రాత్రి అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్క పర్యటించారు. భారీ ర్యాలీ అనంతరం సభలో మాట్లాడుతూ.. “మధిర నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నాం, అభివృద్ధి అంటే భట్టి విక్రమార్క” అని అన్నారు. మండలంలో కొత్త–పాత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. 60 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి.