ADB: నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామంలో ఆడే సక్కారం ఫౌండేషన్ సౌజన్యంతో రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్తులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన సభ్యులను గజేందర్ అభినందించారు.