KDP: చిత్తూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహంకి నిప్పుపెట్టడం దుర్మార్గమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కైపు రామాంజనేయులు అన్నారు. శుక్రవారం కడపలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది కేవలం ఒక విగ్రహంపై దాడి కాదని దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా తాము భావిస్తున్నామని తెలిపారు.