AKP: పాయకరావుపేట పట్టణంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభిస్తారని మండల టీడీపీ అధ్యక్షుడు సీహెచ్. ప్రదీప్, పట్టణ అధ్యక్షుడు వరహాల బాబు తెలిపారు. ఉదయం 10 గంటలకు మంత్రి ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ నుంచి గౌతమి థియేటర్ సెంటర్ వరకు ఆటో డ్రైవర్ల ర్యాలీ జరుగుతుందన్నారు. అనంతరం మంత్రి వారికి ఆర్థిక సహాయం అందిస్తారన్నారు.