VZM: స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో భాగంగా బొబ్బిలి మున్సిపాలిటీని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ మున్సిపాలిటీగా బుధవారం ప్రకటించింది. మున్సిపాలిటీలో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్తశుద్ధి పార్కులో సేంద్రీయ ఎరువును తయారు చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ 2వ స్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకుందని అధికారులు తెలిపారు.