ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ టీటీఈ ఆర్మీ జవాన్ ని కదులుతున్న రైలు లో నుంచి తోసేశాడు. టికెట్ కోసం జరిగిన గొడవ కారణంగా… రైలు లో నుంచి తోసేయడం గమనార్హం. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను రెండు కాళ్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనూ అనే సైనికుడు.. దిబ్రుఘడ్-కొత్త ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో టీటీఈ సుపాన్ బోర్ అక్కడికి వచ్చాడు.
ఇద్దరి మధ్య జరిగిన టికెట్ విషయంలో ఏదో గొడవ జరిగింది. వాగ్వాదం జరుగుతున్న టైంలో కోపంతో సుపాన్.. సోనూని ఒక్కసారిగా రైలు బయటకు నెట్టేశాడు. దీంతో రైలు కిందకు వెళ్లిపోయి తీవ్రంగా గాయపడ్డాడు సోనూ. అది గమనించిన స్థానికులు రైలును ఆపేసి.. టీటీఈని చితకబాదారు. దీంతో సుపాన్ బోర్ అక్కడి నుంచి పరారయ్యాడు.