E.G: నిడదవోలు KVPS, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కవి చక్రవర్తి, నవయుగ వైతాళికుడు, పద్మశ్రీ గుర్రం జాషువా 131వ జయంతి కార్యక్రమం ఆదివారం నిడదవోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా KVPS నాయకులు జువ్వల రాంబాబు, వై.పైడియ్య మోహన్ విష్ణు, కె.రాంబాబు తదితరులు జాషువా చిత్రపటానికి నివాళులర్పించారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జాషువా పోరాడారని వారు గుర్తు చేశారు.