E.G: కడియం మండలంలోని కడియపులంక గ్రామంలో హరి హర మహా క్షేత్రంలో కొలువైయున్న శ్రీ అపర్ణాదేవి అమ్మవారు శరన్నవ రాత్రులలో భాగంగా 7వ రోజు ఆదివారం మహాచండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.