టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీకి పరిమితికి మించి ప్రజలు రావడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ర్యాలీలో విజయ్ మాట్లాడుతున్న సమయంలో ఓ చిన్నారి తప్పిపోయినట్లు వార్త వినగానే ఒక్కసారిగా జనాలు తోసుకోవడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి అదుపుతప్పినట్లు సమాచారం. కాగా, ఇప్పటి వరకు 30 మందికి పైగా మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు.