విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఆటో డ్రైవర్ గణేష్ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. నిందితులు తరుణ్, సోమరాజు, మరో యువకుడు అశోక్లను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్టు సీఐ రవికుమార్ తెలిపారు.