బాపట్లలోని ప్రముఖ ఆలయమైన భావనారాయణ స్వామివారి ఆలయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సతీ సమేతంగా సందర్శించారు. శనివారం ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేసి స్వామివారి వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన స్వచ్ఛోత్సవం ముగ్గులు పరిశీలించారు.