HNK: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నడికూడ మండల కేంద్రంలో ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో MLA ముఖ్యఅతిథిగా పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలున్నారు.