మహబూబాబాద్: తొర్రూరు పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పద్మశాలి మండల కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు.