AP: హీరో చిరంజీవిపై అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గతంలో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై జగన్ను చిరంజీవి గట్టిగా నిలదీశారని.. తాను చేసిన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయన్నారు. కాగా.. కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ తప్పుబట్టిన విషయం తెలిసిందే.