నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ప్యారడైజ్’ మూవీలో మంచు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ఈ మూవీలో శికంజ మాలిక్ పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 2026 మార్చి 26న విడుదలవుతుంది.