GDWL: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం చెరువులు, వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం జిల్లా పోలీసులు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, పొంగి ప్రవహిస్తున్న వాగులను దాటొద్దని వారు పేర్కొన్నారు.