ప్రకాశం: పొగాకును వీడి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తాళ్లూరు ఏవో ప్రసాదరావు కోరారు. ఇందులో భాగంగా తాళ్లూరులో ‘పొగాకు సాగు వద్దు-ప్రత్యామ్నాయ పంటలు ముద్దు’ అనే కరపత్రాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటలు సాగు చేసుకోవాలని ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.