ఉక్రెయిన్ డ్రోన్ డాడుల కారణంగా రష్యా చమురు క్షేత్రాలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇంధన ఎగుమతులను నిలిపివేయాలని మాస్కో నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఇంధన ఎగుమతులపై రష్యా నిషేధం విధించినట్లు తెలుస్తోంది.