NLG: దామరచర్ల మండలంలోని దుబ్బతండాకు చెందిన తేజావత్ అశోక్ నాయక్ గ్రూప్-1 ఫలితాల్లో ఆర్డీఓగా ఎంపికయ్యారు. మారుమూల గిరిజన తండా నుంచి వచ్చి, వ్యవసాయ కూలీల బిడ్డ అయిన అశోక్ నాయక్ సాధించిన విజయంపై పలువురు అభినందనలు తెలిపారు. పేదల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.