NTR: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గురువారం ఉదయం 9గంటలకు ఇన్ ఫ్లో 4,38,600 క్యూసెక్కులుగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 6,632 క్యూసెక్కులు, పడమర ప్రధాన కాలువకు 4,513 క్యూసెక్కులు విడుదల చేశారు. మిగిలిన సర్ ప్లస్ జలాలు 4,27,455 క్యూసెక్కులను బ్యారేజ్ దిగువకు విడుదల చేశారు.